దేవరుప్పుల మండలంలో కూతురితో అసభ్య ప్రవర్తన.. తండ్రిపై పోక్సో కేసు నమోదు

దేవరుప్పుల మండలంలో కూతురితో అసభ్య ప్రవర్తన.. తండ్రిపై పోక్సో కేసు నమోదు

పాలకుర్తి ( దేవరుప్పుల), వెలుగు : కూతురితో అసభ్యంగా ప్రవర్తిస్తున్న తండ్రిపై పోక్సో కేసు నమోదైన ఘటన జనగామ జిల్లాలో జరిగింది. దేవరుప్పుల మండలంలోని ఒక గ్రామానికి చెందిన బాలిక స్థానికంగా ఏడో తరగతి చదువుతోంది. ఆమె తల్లి అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో కొంతకాలంగా ఇంట్లో ఒంటరిగా ఉండే సమయంలో తండ్రి కూతురితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో బాలిక తన తల్లికి చెప్పినా పట్టించుకోవడంలేదు. ఏం చేయాలో తెలియని బాలిక స్థానిక అంగన్​వాడీ టీచర్​తో తన పరిస్థితిని చెప్పుకుంది. 

ఆమె జగిత్యాలలో ఉండే బాలిక పెద్దమ్మకు ఫోన్ చేసి విషయం చెప్పింది. ఆమె బంధువులతో కలిసి అక్కడికి వెళ్లి తండ్రికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై పోక్సో తో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు ఎస్ఐ సృజన్​కుమార్​తెలిపారు.