దీపావళి సందర్భంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు(OMCs) శుభవార్త చెప్పాయి. పెట్రోల్ పంప్ డీలర్స్కు చెల్లించే డీలర్ కమీషన్ను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఇవాల్టి (అక్టోబర్ 30, 2024) నుంచే ఈ పెంచిన డీలర్ కమీషన్ అమల్లోకి రానుంది. ఈ విషయాన్ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించింది. ఈ ప్రభావంతో దేశంలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నాయి.
धनतेरस के शुभ अवसर पर तेल कंपनियों द्वारा पेट्रोल पंप डीलरों को दी गई बड़ी सौगात का हार्दिक स्वागत!
— Hardeep Singh Puri (@HardeepSPuri) October 29, 2024
7 वर्षों से चली आ रही डिमांड हुई पूरी!
उपभोकताओं को मिलेंगी बेहतर सेवाएं पर पेट्रोल और डीज़ल के दामों में कोई बढ़ोतरी नहीं।
तेल कंपनियों द्वारा दूरदराज़ स्थानों (तेल विपणन… https://t.co/SbKtxzYZGR pic.twitter.com/oZDl7ulljF
ఈ మార్పు కారణంగా దేశంలోని ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్ ఘర్ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నాయి. ఒక రాష్ట్రానికి, మరో రాష్ట్రానికి డీలర్ కమీషన్లో తేడా ఉంటుంది. ఒక రాష్ట్రంలో కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఈ డీలర్ కమీషన్ ఉంటుంది. అంతర్రాష్ట్ర సరుకు రవాణా హేతుబద్ధీకరణలో భాగంగా ఆయిల్ కంపెనీలు డీలర్ కమీషన్ పెంచడం గమనార్హం.
ALSO READ | మారుతీ సుజుకి లాభం రూ. 3,102 కోట్లు
ఛత్తీస్ ఘర్, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. మహారాష్ట్ర, జార్ఖండ్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ఈ రాష్ట్రాల్లో ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటామని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ చెప్పారు. ఒడిశాలోని కూనన్పల్లిలో పెట్రోల్ ధర లీటర్పై అత్యధికంగా 4 రూపాయల 69 పైసలు, లీటర్ డీజిల్ పై రూ.4.45 పైసలు ధర తగ్గింది.