ప్రభుత్వం ఎన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నా... వినియోగదారులు మాత్రం మోసపోతున్నారు. నిత్యవసరా వస్తువుల్లో ప్రతిది కల్తీ కాగా... ఇక పెట్రోల్ విషయంలో రీడింగ్ మోసాలు జరుగుతున్నారు. తాజాగా వైరా రోడ్ లోని బాబురావు పెట్రోల్ బంక్ లో 2 లీటర్లకు రీడింగ్ నమోదు చేసి పైసలు తీసుకొని పెట్రోల్ రాకపోయినా వచ్చినట్లు బంక్ సిబ్బంది వాదించారు.దాంతో కొద్దిదూరం పోగానే ద్విచక్రవాహనం ఆగిపోవడంతో బాధితుడు బంక్ కు వచ్చి ప్రశ్నించాడు.. దాంతో సిబ్బంది , యాజమాన్యం కలిసి కస్టమర్ని దబాయించడంతో విషయం బయటికి పొక్కింది.
ఖమ్మంలోని అనేక పెట్రోల్ బంకుల్లో ఇదే విధంగా జరుగుతుందనే ఆరోపణలున్నాయి. పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు పెట్రోల్ బంకుల నిర్వాహకుల నుంచి నెలవారి మామూళ్లు తీసుకొని తనిఖీల కోసం రావడం లేదు. ఫిర్యాదు వస్తేనే తనిఖీలు చేపడతామంటూ నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. ప్రజలను మోసం చేస్తున్న పెట్రోల్ బంకుల నుంచి భారీగా ముడుతుండటంతోనే చర్యలు తీసుకోవడానికి అధికారులు వెనకాడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. సిబ్బంది పై కాకుండా పెట్రోల్ బంకు నిర్వాహకుల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. యాజమాన్యాలు తెలివిగా సిబ్బందిపై నింద మోపి తప్పించుకొని ప్రజల జేబుకు చిల్లు వేస్తున్నారు.