పెట్రోల్‌‌,డీజిల్‌‌ ఫ్రీ అంటూ సైబర్ కేటుగాళ్ల చీటింగ్

పెట్రోల్‌‌,డీజిల్‌‌ ఫ్రీ అంటూ సైబర్ కేటుగాళ్ల చీటింగ్

హైదరాబాద్‌‌,వెలుగు: సైబర్ నేరగాళ్లు రూటు మార్చారు. ఆన్‌‌లైన్‌‌ సర్వేలో పాల్గొనే వారికి రూ.6 వేలు విలువ చేసే పెట్రోల్‌‌,డీజిల్‌‌ ఫ్రీ అంటూ ప్రచారం చేస్తున్నారు. సోషల్‌‌ మీడియాలో వైరల్‌‌ అవుతున్న ఫేక్‌‌ సర్వేపై సైబర్ క్రైమ్ పోలీసులు నిఘా పెట్టారు.

వివరాల్లోకి వెళ్తే..ఇండియన్ ఆయిల్‌‌ పేరుతో ఆన్‌‌లైన్‌‌లో సర్వే నిర్వహిస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు.ఆన్‌‌లైన్‌‌ సర్వేలో అడిగిన ప్రశ్నలకు కరెక్ట్‌‌ ఆన్సర్‌‌‌‌ చేయాలని చెప్తున్నారు. సర్వేలో పాల్గొన్న వారి పేర్లు,ఫోన్ నంబర్స్‌‌తో లక్కీ డ్రా తీస్తామని నమ్మిస్తున్నారు. విన్నర్స్‌‌కి రూ.6 వేలు విలువ చేసే పెట్రోల్‌‌ లేదా డీజీల్‌‌ను ఫ్రీగా అందిస్తున్నామని చెప్పి అకౌంట్స్​ నుంచి డబ్బు కొట్టేస్తున్నారు. ఇలాంటివి     నమ్మి మోసపోవద్దని సైబర్​ క్రైమ్​ పోలీసులు సూచిస్తున్నారు.