
దేశంలో వరుసగా 13వ రోజు పెట్రోల్, డీజీల్ ధరలు పెరిగాయి. కరోనా లాక్ డౌన్ సమయంలో 82 రోజుల పాటు ఆయిల్ ధరలను పెంచని చమురు సంస్థలు జూన్ 7 నుంచి మొదలు పెట్టి ప్రతి రోజూ ధరలను రివైజ్ చేస్తూ వస్తున్నాయి. తాజాగా శుక్రవారం లీటరుకు పెట్రోల్‌పై 56 పైసలు, డీజిల్‌పై 63 పైసలు పెంచాయి. ఈ 13 రోజుల్లో పెట్రోల్‌పై రూ.6.51, డీజిల్‌పై రూ.7 చొప్పున అదనపు భారాన్ని ప్రజలపై మోపాయి. దీంతో దేశంలో హైదరాబాద్ సహా పలు మేజర్ సిటీల్లో పెట్రోల్ ధరలు రూ.80ని దాటిపోయాయి. డీజిల్ ధరలు రూ.75ను దాటేశాయి.
ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు
సిటీ పెట్రోల్ (రూ.) డీజిల్ (రూ.)
హైదరాబాద్ 81.36 75.31
ముంబై 85.21 75.53
చెన్నై 81.82 74.77
బెంగళూరు 80.91 73.28
విశాఖపట్నం 80.14 74.11
ఢిల్లీ 78.37 77.06