ఆగని బాదుడు.. రూ.105కి చేరిన పెట్రోల్

ఆగని బాదుడు.. రూ.105కి చేరిన పెట్రోల్

దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు మరోసారి పెరిగాయి. పెట్రోల్ పై  35 పైసలు, డీజిల్ పై 28 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి ఆయిల్ కంపెనీలు. దీంతో దేశంలో పెట్రోల్,డీజిల్ రేట్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. పెరిగిన ధరలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 98 రూపాయల 81 పైసలకు పెరగగా..లీటర్ డీజిల్ ధర 88 రూపాయల 18 పైసలకు చేరింది. ముంబైలో  లీటర్ పెట్రోల్ ధర 105 రూపాయలకు చేరువైంది. ప్రస్తుతం అక్కడ లీటర్ పెట్రోల్ ధర 104 రూపాయల 90 పైసలకు చేరింది. ముంబైలో లీటర్ డీజిల్ 96 రూపాయల 72 పైసలకు పెరిగింది. చెన్నెలో లీటర్ పెట్రోల్ ధర వందకు చేరువైంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర 99 రూపాయల 82 పైసలుగా ఉండగా..లీటర్ డీజిల్ ధర 93 రూపాయల 74 పైసలుగా ఉంది. కోల్ కతాలో లీటర్ పెట్రోల్ ధర  98 రూపాయల 64 పైసలు, లీటర్ డీజిల్ ధర 92 రూపాయల 3 పైసలకు పెరిగింది. మే 4 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, మణిపూర్, జమ్ము కశ్మీర్, లఢఖ్ లో పెట్రోల్ రేట్లు వంద దాటాయి. న్యూయార్క్ తో పోల్చితే ముంబైలో లీటర్ పెట్రోల్ ధర దాదాపు డబుల్ రేటు ఉంది.