ఢిల్లీకి ఫైజర్ కంపెనీ వ్యాక్సిన్‌‌ అమ్మదట

ఢిల్లీకి ఫైజర్ కంపెనీ వ్యాక్సిన్‌‌ అమ్మదట

న్యూఢిల్లీ: ఫైజర్‌, మోడర్నా కంపెనీలు టీకాలను తమకు అమ్మేందుకు నిరాకరించాయని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. వ్యాక్సిన్‌‌ల కొనుగోలు విషయంలో నేరుగా కేంద్ర ప్రభుత్వంతోనే డీల్ చేస్తామని సదరు కంపెనీలు స్పష్టం చేశాయని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ‘మేం వ్యాక్సిన్ కోసం ఫైజర్, మోడర్నా సంస్థలతో మాట్లాడాం. అయితే మాకు నేరుగా టీకాలు అమ్మేందుకు ఆ రెండు సంస్థలూ నిరాకరించాయి. కేంద్ర ప్రభుత్వంతోనే నేరుగా డీల్ చేస్తామని చెప్పాయి. కాబట్టి వ్యాక్సిన్‌‌లను దిగుమతి చేసుకొని రాష్ట్రాలకు పంపిణీ చేయాలని కేంద్రాన్ని కోరుతున్నాం’ అని కేజ్రీవాల్ చెప్పారు. కాగా, విదేశీ కంపెనీల నుంచి వ్యాక్సిన్‌‌ను కొనుగోలు చేసే అవకాశాన్ని రాష్ట్రాలకు కేంద్రం అవకాశం కల్పించింది. అయితే రాష్ట్రాలకు టీకాలు అమ్మేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఢిల్లీతోపాటు తమకు టీకాలు అమ్మాలని కోరిన పంజాబ్‌‌కు కూడా మోడర్నా కంపెనీ నో చెప్పింది.