ఎమర్జెన్సీ వాడకాన్ని ఉపసంహరించుకున్న ఫైజర్

ఎమర్జెన్సీ వాడకాన్ని ఉపసంహరించుకున్న ఫైజర్

భారత్‌లో తమ వ్యాక్సిన్ ఎమర్జెన్సీ వాడకం కోసం పెట్టిన దరఖాస్తును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రముఖ ఫార్మా కంపెనీ ఫైజర్ తెలిపింది. ఫైజర్ భారత్‌లో కంటే ముందే యూకే మరియు బహ్రెయిన్‌లో ఎమర్జెన్సీ వాడకానికి అనుమతులు పొందింది. అంతేకాకుండా భారత్‌లో ఈ అనుమతుల కోసం దరఖాస్తు చేసిన మొదటి కంపెనీ ఫైజర్ కావడం గమనార్హం.

భారత డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ యొక్క సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ సమావేశంలో ఫైజర్ ప్రతినిధులు ఫిబ్రవరి 3న పాల్గొన్నారు. ఆ సమావేశంలో రెగ్యులేటరీ వ్యాక్సిన్ యొక్క అదనపు సమాచారాన్ని కోరింది. ఈ వ్యాక్సిన్ అతితక్కువ సమయంలో అందుబాటులోకి రావడంతో.. మరింత సమాచారాన్ని జతచేసి ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ (EUA) కోసం మరోసారి దరఖాస్తు చేస్తామని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు.

For More News..

రాష్ట్రంలో థియేటర్ల హౌస్‌పుల్‌కు అనుమతి

ఆస్కార్ రేసులో విద్యాబాలన్ షార్ట్ ఫిల్మ్

సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు పెడితే పాస్‌పోర్ట్ ఇవ్వరట