పోలీస్ కిష్టయ్య కూతురికి పీజీ అడ్మిషన్

పోలీస్ కిష్టయ్య కూతురికి పీజీ అడ్మిషన్

కరీంనగర్,వెలుగు: తెలంగాణ ఉద్యమంలో అమరుడైన కానిస్టేబుల్ కిష్టయ్య కూతురు డాక్టర్ ప్రియాంక చల్మెడ ఆనందరావు కాలేజీలో మేనేజ్​మెంట్ కోటాలో జనరల్ సర్జన్ పీజీలో చేరారు. ఎంబీబీఎస్ చదివేందుకు గతంలో సీఎం కేసీఆర్ ఆమెకు ఆర్థిక సహకారం అందించారు. 

ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత పీజీ చేయాలనుందని చెప్పడంతో చల్మెడ ఆనందరావు కాలేజీలో మేనేజ్‌‌‌‌మెంట్​కోటా కింద రూ.24 లక్షల ఫీజు చెల్లించి జనరల్ సర్జన్ పీజీ కోర్సులో చేర్పించారు. ఈ సందర్భంగా ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బి.వినోద్ కుమార్, రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ రవీందర్​కు ప్రియాంక కృతజ్ఞతలు తెలియజేశారు.