హైదరాబాద్, వెలుగు: నగరానికి చెందిన ఫార్మా, ప్యాకేజీ ప్రెన్యూర్ చక్రవర్తి, ఫెడరేషన్ ఆఫ్ ఫార్మా ఎంటర్‌ప్రెన్యూర్స్ (ఎఫ్ఓపీఈ ) సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. ప్యాకేజింగ్, ఫార్మా ప్రొఫెషనల్ అయిన ఆయన ఎకోబ్లిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్( ఇండో డచ్ జాయింట్ వెంచర్) సీఈఓ. ఫార్మా పరిశ్రమకు చేసిన కృషికి ఆయనకు 'ఫార్మా రత్న' అవార్డు కూడా వచ్చింది.
ఢిల్లీలో జరిగిన ఎఫ్ఓపీఈ ఏజీఎం లో ఆయనను ఈ పదవికి ఎంపిక చేశారు. దీనిపై చక్రవర్తి స్పందిస్తూ, జాతీయ స్థాయిలో ఫార్మా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వంతో చర్చించాలనే లక్ష్యంతో ఎఫ్ఓపీఈను ప్రారంభించారని అన్నారు. పూర్తయిన ఫార్ములేషన్‌లపై ఎక్సైజ్ సుంకం రేటు, ఫిక్స్‌డ్- డోస్ కాంబినేషన్‌లు, నకిలీ ఔషధాల చట్టం సవరణ బిల్లు, డీపీసీఓ/ఎన్పీపీఏ సమస్యలు మొదలైన అనేక సమస్యలపై సంబంధిత ప్రభుత్వ విభాగాలతో కలసి పనిచేశామని చెప్పారు.
