Women's ODI World Cup 2025: ఫోబ్ లిచ్‌ఫీల్డ్ మెరుపు సెంచరీ.. ఆసీస్‌ను ఆపలేకపోతున్న ఇండియా

Women's ODI World Cup 2025:  ఫోబ్ లిచ్‌ఫీల్డ్ మెరుపు సెంచరీ.. ఆసీస్‌ను ఆపలేకపోతున్న ఇండియా

మహిళల వరల్డ్ కప్ లో గురువారం (అక్టోబర్ 30) ఆస్ట్రేలియాతో జరుగుతున్న సెమీ ఫైనల్లో ఇండియా బౌలర్స్ విఫలమవుతున్నారు. వికెట్ తీయలేక నానా కష్టాలు పడుతున్నారు. టీమిండియా వీక్ బౌలింగ్ ను ఒక ఆటాడుకుంటూ ఆసీస్ ఓపెనర్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్ మెరుపు సెంచరీతో పరుగుల వరద పారిస్తోంది. 77 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్న ఈ ఆసీస్ ఓపెనర్ వరల్డ్ కప్ లో తొలి సెంచరీ కావడం విశేషం. ఆమె ఇన్నింగ్స్ లో 17 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. లిచ్‌ఫీల్డ్ కు పెర్రీ సహకారం అందించడంతో ఆస్ట్రేలియా భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. ప్రస్తుతం 25 ఓవర్లలో వికెట్ నష్టానికి 159 పరుగులు చేసింది. 

క్రీజ్ లో లిచ్‌ఫీల్డ్ (102), పెర్రీ (41) ఉన్నారు. రెండో వికెట్ కు లిచ్‌ఫీల్డ్, పెర్రీ  అజేయంగా 134 పరుగులు జోడించి జట్టును భారీ స్కోర్ దిశగా తీసుకెళ్తున్నారు. వీరి జోడీని విడదీయడానికి ఇండియా కష్టాలు పడుతోంది. టాస్ గెలిచి ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ కు దిగింది. ప్రమాదకరమైన కెప్టెన్ హీలేను 5 పరుగులకే ఔట్ చేసి క్రాంతి గౌడ్ క్లీన్ బౌల్డ్ చేసి టీమిండియాకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. దీంతో ఆస్ట్రేలియా 25 పరుగుల వద్ద తమ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత పెర్రీతో కలిసిన లిచ్‌ఫీల్డ్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడింది. వరుసబెట్టి బౌండరీలు బాదుతూ హాఫ్ సెంచరీ.. ఆ తర్వాత సెంచరీ మార్క్ అందుకుంది.

Also Read:-ప్లేయింగ్ 11లో మరోసారి తడబడిన టీమిండియా.. హర్లీన్ డియోల్‌పై వేటు 

 నవీ ముంబై వేదికగా డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సెమీస్ సమరంలో ఆస్ట్రేలియా ఒక మార్పుతో బరిలోకి దిగుతుంది. వేర్‌హామ్ స్థానంలో సోఫీ మోలినెక్స్ వచ్చింది. మరోవైపు ఇండియా గాయపడిన ప్రతీక రావల్ స్థానంలో షెఫాలీ వర్మను తీసుకొచ్చింది. బంగ్లాదేశ్ తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ కు దూరంగా ఉన్న రిచా ఘోష్  జట్టులోకి వచ్చింది. హర్లీన్ డియోల్ స్థానంలో క్రాంతి గౌడ్ ప్లేయింగ్ 11లోకి వచ్చింది.