న్యూఢిల్లీ: వాల్‌మార్ట్‌కు చెందిన డిజిటల్ చెల్లింపుల యాప్ ఫోన్‌పే.. అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్, దాని పెట్టుబడిదారుల నుంచి 100 మిలియన్లను (దాదాపు రూ.820 కోట్లు) సేకరించింది. ఫోన్‌పేకు ఇప్పటి వరకు పలు ఇన్వెస్టర్ల నుంచి 750 మిలియన్ డాలర్లు అందాయి. బిలియన్ డాలర్ల మూలధన సేకరణలో భాగంగా ఈ కొత్త నిధులను ఇన్వెస్టర్లు అందించారు. జనరల్ అట్లాంటిక్ ఈ ఏడాది జనవరిలోనూ ఫోన్‌పేలో 350 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది. 12 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్‌లో బిలియన్ డాలర్లను విడతలుగా సమీకరిస్తునట్లు ఫోన్‌పే జనవరిలో ప్రకటించింది.
అప్పటి నుంచి ఫిన్‌టెక్ జనరల్ అట్లాంటిక్ నుంచి 350 మిలియన్ డాలర్లు, టైగర్ గ్లోబల్ మేనేజ్‌మెంట్, రిబ్బిట్ క్యాపిటల్, టీవీఎస్ క్యాపిటల్ నుంచి 100 మిలియన్ డాలర్లు, తన అతిపెద్ద వాటాదారు–వాల్‌మార్ట్ నుంచి 200 మిలియన్ డాలర్లు సేకరించింది. ఈ నిధులను ఇన్సూరెన్స్, వెల్త్ మేనేజ్‌మెంట్, లెండింగ్, స్టాక్‌బ్రోకింగ్, అకౌంట్ అగ్రిగేటర్ వంటి కొత్త వ్యాపారాలను నిర్మించడానికి, విస్తరించడానికి ఉపయోగించనుంది. యూపీఐ లైట్‌తోపాటు యూపీఐ క్రెడిట్ కోసం ఇన్వెస్ట్ చేయనుంది.తాజాగా ఫోన్‌పే కొత్త కన్జూమర్–ఫేసింగ్ అప్లికేషన్ ‘పిన్‌కోడ్’ను ప్రారంభించింది. ఆన్లైన్ బిజినెస్ కోసం కేంద్రం డెవెలప్ చేస్తున్న ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ఫ్రేమ్‌వర్క్‌కు దీనిని ఇంటిగ్రేట్ చేయనుంది.
