ఫోన్ ట్యాపింగ్ కేసు స్పీడప్ .. 7 చోట్ల మానిటరింగ్ సెంటర్లు

ఫోన్ ట్యాపింగ్ కేసు స్పీడప్ ..  7 చోట్ల మానిటరింగ్ సెంటర్లు

ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు స్పీడప్ చేశారు పోలీసులు. విచారణలో రోజుకో కొత్త విషయం బటయకొస్తోంది. నల్లగొండ, హైదరాబాద్ లో రెండు చోట్ల రెండు ఫోన్ ట్యాపింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు గుర్తించారు పోలీసులు. వరంగల్ దగ్గర పర్వతగిరి, సిరిసిల్ల, ఖమ్మంలో ఒక్కో ట్యాపింగ్ సెంటర్లు చేసినట్లు విచారణలో తేలింది. ఇప్పటివరకు 7 ఫోన్ ట్యాపింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు కనుగొన్నారు పోలీసులు. 

నల్లగొండ విటీ కాలనీలో నల్లగొండ, రంగారెడ్డి ,మహబూబ్ నగర్ జిల్లాల మానిటరింగ్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఖమ్మ జిల్లా కోసం నేలకొండపల్లి మామిడి తోటలోని గెస్ట్ హౌజ్ లో ట్యాపింగ్ సెంటర్ అరెంజ్ చేసినట్లు సమాచారం.హైదరాబాద్ ఎస్ఐబీ ఆఫీస్ తో పాటు జూబ్లీహిల్స్ లో ట్యాపింగ్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.  

కానిస్టేబుల్ నుండి డీసీపీ స్థాయి వరకు ట్యాపింగ్ ను అడ్డం పెట్టుకుని సెటిల్మెంట్లు, బెదిరింపులకు పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు.  నేతల కనుసన్నల్లో ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు గుర్తించారు. ఈ కేసులో పోలీసులు నలుగురు కానిస్టేబుల్స్ అదుపులోకి తీసుకోగా..  పలువురు నేతలకు నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉంది