
న్యూఢిల్లీ: ఫిన్‌టెక్ యూనికార్న్ కంపెనీలు భారత్‌పే, ఫోన్‌పే చివరికి తమ లీగల్ గొడవను సెటిల్ చేసుకున్నాయి. పేరు చివరిలో ‘పే’ వాడేందుకు ట్రేడ్‌మార్క్ పొందడపై ఈ రెండు కంపెనీలు గొడవ పడుతున్నాయి. గత ఐదేళ్లుగా ఈ రెండు కంపెనీలు చట్ట పరమైన వివాదాల్లో ఉన్నాయి. తాజాగా కుదిరిన సెటిల్‌మెంట్ ప్రకారం, కోర్టుల్లో ఒకరిపై ఒకరు ఫైల్ చేసిన పిటీషన్లను ఇరు కంపెనీలు విత్‌డ్రా చేసుకోనున్నాయి.
ఫలితంగా తమ ట్రేడ్‌మార్క్‌ను రిజిస్టర్ చేసుకోవడానికి వీలుంటుంది. ఇరు కంపెనీల మేనేజ్‌మెంట్ గొడవను సెటిల్ చేసుకోవడానికి ముందుకు రావడం అభినందనీయమని, చట్ట పరమైన వివాదాలను పరిష్కరించుకొని ముందుకెళ్లాలని చూస్తున్నామని భారత్‌పే చైర్మన్ రాజ్‌నీష్ కుమార్ అన్నారు. ఇలాంటి అభిప్రాయాన్నే ఫోన్‌పే సీఈఓ సమీర్ నిగమ్ వ్యక్తం చేశారు.