
న్యూఢిల్లీ: డిజిటల్ పేమెంట్స్ సంస్థ ఫోన్‌పే గూగుల్‌కు పోటీగా అండ్రాయిడ్ యాప్ స్టోర్‌ను అందుబాటులోకి తేనున్నట్టు ప్రకటించింది. "www.indusappstore.com," పేరుతో యాప్‌స్టోర్‌ను ప్రారంభిస్తునట్టు తెలిపింది. అండ్రాయిడ్ డెవెలపర్లు దీనిలో ఉచితంగా తమ యాప్స్‌ను అప్లోడ్ చేసుకోవచ్చు.
ఏడాది వరకు ఎలాంటి ఫీజూ వసూలు చేయబోమని, ఆ తరువాత నామమాత్రంగా చార్జీలు తీసుకుంటామని ఫోన్‌పే తెలిపింది. ప్రతి యాప్ ఇండియన్ యూజర్లకు తగినట్టుగా, 12 స్థానిక భాషల్లో అందుబాటులో ఉంటుంది. కొత్త డెవెలపర్ల కోసం లాంచ్ ప్యాడ్‌ను కూడా తీసుకొస్తున్నట్టు సంస్థ వెల్లడించింది.