చిన్నారికి ఖైదీ దర్శన్ గెటప్​ .. కర్నాటక రాష్ట్ర బాలల హక్కుల సంఘం ఫైర్

చిన్నారికి ఖైదీ దర్శన్ గెటప్​ .. కర్నాటక రాష్ట్ర బాలల హక్కుల సంఘం ఫైర్
  • కర్నాటకలో పేరెంట్స్ నిర్వాకం.. బాలల హక్కుల సంఘం ఫైర్

బెంగళూరు: జైలు శిక్ష అనుభవిస్తున్న కన్నడ యాక్టర్ దర్శన్​లాగా తమ చిన్నారిని రెడీ చేసి ఫొటో షూట్ చేసిన తల్లిదండ్రులపై కర్నాటక రాష్ట్ర బాలల హక్కుల సంఘం ఫైర్ అయింది. వాళ్ల మీద బుధవారం కేసు నమోదు చేసింది. ఆ తల్లిదండ్రుల ఆచూకీ తెలియజేయాలని పోలీసులను కోరింది. ఓ జంట తమ చిన్నారిని ఫొటో షూట్ చేసేందుకు డిఫరెంట్ గెటప్​లో రెడీ చేసింది. రేణుస్వామిని చంపిన కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న దర్శన్​ను తలపించేలా.. తల్లిదండ్రులు తమ పిల్లాడికి ఖైదీని పోలిన డ్రెస్ కుట్టించారు.

దానిపై ఖైదీ నంబర్ ‘6106’ రాయించారు. బాలుడి చేతులకు సంకెళ్లు వేసి ఫొటో షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలు వైరల్ కావడంతో బాలల హక్కుల సంఘం సుమోటోగా కేసు ఫైల్ చేసింది. ఇది జువైనల్ చట్టాన్ని అతిక్రమించడమేనని మండిపడింది. ఆ పేరెంట్స్ ను గుర్తించి యాక్షన్ తీసుకుంటామంది. కాగా, దర్శన్ ఖైదీ నంబర్ 6106 కర్నాటకలో ట్రెండ్ అవుతోంది. దర్శన్ అభిమానులు ఆ నంబర్​ను టాటూగా వేయించుకుంటున్నారు. వెహికల్ రిజిస్ట్రేషన్లకు కూడా అదే నంబర్​ను ఎంచుకుంటున్నారు. ‘ఖైదీ నంబర్ 6106’ టైటిల్ రిజిస్ట్రేషన్​కు కూడా అప్లికేషన్లు వచ్చాయని కన్నడ ఫిల్మ్ చాంబర్ ప్రతినిధులు చెప్తున్నారు.