పేకాట ఆడిన పెద్దోడు, చిన్నోడు.. వైరల్ అవుతున్న ఫోటోలు

పేకాట ఆడిన పెద్దోడు, చిన్నోడు.. వైరల్ అవుతున్న ఫోటోలు

టాలీవుడ్ స్టార్ హీరోస్ విక్టరీ వెంకటేష్(Victory Venkatesh), సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar mahesh babu) పేకాటాడుతూ కనిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రముఖ ప్రైవేట్ కంపెనీ ఏర్పాటు చేసిన ప్రైవేట్ ఈవెంట్ కి ఈ ఇద్దరు హీరోలు చీఫ్ గెస్టులుగా హాజరైనట్టు సమాచారం. అక్కడే చిల్ అవుతూ.. మహేష్, వెంకటేష్ పేకాడుతూ కనిపించారు. వైరల్ అవుతున్న ఫోటోలలో.. ఈ హీరోల చేతిలో కార్డ్స్ ఉండగా.. ముందు టేబుల్ పై రూ.500 నోట్లు కట్టలు కనిపించాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి.

ఇక ఈ ఇద్దరి హీరోల సినిమాల విషయానికి వస్తే.. మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా 2024 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక వెంకటేష్  శైలేష్ కొలను దర్శకత్వంలో సైంధవ్ సినిమా చేస్తున్నారు. యాక్షన్ అండ్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండు సినిమాలపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.  

Also Read :- మహేష్ మాస్ ఫీస్ట్.. అదిరిపోయిన దమ్ మసాలా సాంగ్ ప్రోమో