ఫిజికల్‌‌‌‌ హెల్తే కావాలట

ఫిజికల్‌‌‌‌ హెల్తే కావాలట

ఫిజికల్‌‌‌‌ హెల్త్‌‌‌‌ ముఖ్యమా.. మెంటల్‌‌‌‌ హెల్త్‌‌‌‌కు ఓటేస్తారా? అంటే ఇండియన్లు ఫిజిక్‌‌‌‌కే ఎక్కువ ఇంపార్టెన్స్‌‌‌‌ ఇస్తున్నారు. 75% మంది ఫిజికల్‌‌‌‌, 62% మంది మెంటల్‌‌‌‌ హెల్త్‌‌‌‌పై దృష్టి పెడుతున్నారు. 64% మంది రెండూ ముఖ్యమే అంటున్నారు. వరల్డ్‌‌‌‌ మెంటల్‌‌‌‌ హెల్త్‌‌‌‌ డే సందర్భంగా అక్టోబర్‌‌‌‌ 10న ఓ గ్లోబల్‌‌‌‌ మార్కెట్‌‌‌‌ రీసెర్చ్‌‌‌‌ ఏజెన్సీ ఇప్సోస్‌‌‌‌ చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.

ఫిజికల్‌‌‌‌, మెంటల్‌‌‌‌ హెల్త్‌‌‌‌ విషయంలో ఇండియన్లలో మార్పు వస్తోందని, రెండూ బ్యాలెన్స్‌‌‌‌గా ఉంటేనే శరీరం బాగుంటుందని నమ్ముతున్నారని సర్వే పేర్కొంది. మెంటల్‌‌‌‌ హెల్త్‌‌‌‌నూ సాధారణ రోగంలానే చూస్తున్నారని సర్వేలో తేలింది.