
- లేదంటే బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తం
ఖైరతాబాద్, వెలుగు : ఎస్సీ వర్గీకరణ బిల్లు చివరి పార్లమెంటు సమావేశాల్లో పెట్టి ఆమోదించాలని, లేకుంటే బీజేపీకి వ్యతిరేకంగా లోక్ సభ ఎన్నికల ప్రచారం చేస్తామని మాదిగ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో అతి పెద్ద సామాజిక వర్గమైన మాదిగలకు కేసీఆర్‌తో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. వర్గీకరణ చేపడతామని చెప్పిన ప్రధాని మోదీ కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు.
వర్గీకరణ జరగక పోతే ఫిబ్రవరి రెండో వారంలో చలో ఢిల్లీ నిర్వహిస్తామన్నారు. వర్గీకరణలో తాము 12 శాతం రిజర్వేషన్అడిగామని, మందకృష్ణ 7 శాతం అడిగారని అందుకే టెక్నికల్‌గా ఆయన్ని వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికలతో కేసీఆర్పని అయిపోయినట్టేనని, ఆ ఎన్నికల అనంతరం ఆ పార్టీ ముక్కలవుతుందని జోస్యం చెప్పారు. ఈ సమావేశంలో గడ్డం యాదన్న, ఎల్లేశ్, నీల రాజు, కొండవీటి గోవిందరావు, కనక వంశీ తదితరులు పాల్గొన్నారు.