గద్వాలలో పందుల పోటీలు

గద్వాలలో పందుల పోటీలు

గద్వాల, వెలుగు : కోడి పందాలు, ఎడ్ల పోటీల గురించి విన్నాం. చూశాం. కానీ  పందుల పోటీల గురించి ఎప్పుడైనా విన్నారా? పందులకు కూడా పోటీలు పెడతారని ఆశ్చర్యపోతున్నారా కానీ ఇది నిజం. జోగులాంబ గద్వాల జిల్లాలో నిర్వహించిన పందుల పోటీలు అందరినీ ఆకట్టుకున్నారు. భూలక్ష్మీ చెన్నకేశవ స్వామి జాతర సందర్భంగా దౌదర్ పల్లి శివారులో పందులకు పోటీలు పెట్టారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలకు చెందిన 20 పందులు ఇందులో పాల్గొన్నాయి. ఏకలవ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన పందులకు బహుమతులు కూడా అందజేశారు. ఫస్ట్ ప్లేస్ లో నిలిచిన పందుల యజమానులకు ప్రైజ్ మనీగా రూ.30,000, సెకండ్ ప్రైజ్ రూ.20,000, థర్డ్ ప్రైజ్గా రూ.10,000 ఇచ్చారు.