బీఆర్ఎస్​కు కోకాపేటలో భూ కేటాయింపుపై హైకోర్టులో పిల్

బీఆర్ఎస్​కు కోకాపేటలో భూ కేటాయింపుపై హైకోర్టులో పిల్

భారత్​ రాష్ట్ర సమితి పార్టీకి హైదరాబాద్​లోని కోకాపేటలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి 11 ఎకరాలు కేటాయించడంపై ఫోరం ఫర్​ గుడ్​ గవర్నెన్స్​ జులై 10న హైకోర్టులో పిల్​ వేసింది. పిటిషనర్ తెలిపిన​అందులో పేర్కొన్న వివరాల ప్రకారం.. కోకాపేటలో ఎకరానికి రూ.50 కోట్ల విలువైన భూమి ఉంది. దాన్ని అధికార పార్టీకి రూ.3.41 కోట్లకే కేటాయించారు. 

అయిదు రోజుల్లో భూ కేటాయింపులు పూర్తి చేశారని.. పార్టీకి ఇది వరకే బంజారాహిల్స్​లో కార్యాలయం ఉండగా కొత్తగా అతి తక్కువ ధరకు ఎందుకు కేటాయించారన్నది పిటిషనర్ వాదన. శిక్షణ, ఎక్సలెన్స్​ పేరిట బీఆర్ఎస్ భూమి పొందిందని, భూ కేటాయింపు వివరాలు రహస్యంగా ఉంచారని ఆరోపించారు.  తీసుకున్న భూమిలో నిర్మాణ పనులు చేపట్టకుండా స్టే ఇవ్వాలని ఎఫ్​జీజీ కోరింది.