99 మంది కాంగ్రెస్ ఎంపీలపై అనర్హత వేటు వేయండి

99 మంది కాంగ్రెస్ ఎంపీలపై అనర్హత వేటు వేయండి
  • అలహాబాద్‌‌‌‌ హైకోర్టులో పిల్‌‌‌‌ దాఖలు

అలహాబాద్‌‌‌‌: కాంగ్రెస్​కు ఎంపీల్లో 99 మందిపై అనర్హత వేటు వేయాలని  యూపీలోని అలహాబాద్‌‌‌‌ హైకోర్టులో పిల్‌‌‌‌ దాఖలైంది. ఈ పిల్‌‌‌‌ను ఫతేపూర్‌‌‌‌‌‌‌‌ జిల్లాకు చెందిన భారతి దేవి అనే మహిళ దాఖలు చేశారు. లోక్‌‌‌‌సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌‌‌‌ ‘ఘర్‌‌‌‌‌‌‌‌ ఘర్‌‌‌‌‌‌‌‌ గ్యారంటీ స్కీమ్‌‌‌‌’ను ప్రకటించిందని, ఈ స్కీమ్‌‌‌‌లో భాగంగా ఓటు వేస్తే ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చడమే కాకుండా ఇతర సౌకర్యాలు కల్పిస్తామని కాంగ్రెస్‌‌‌‌ ఎంపీ అభ్యర్థులు ప్రజలకు హామీ ఇచ్చారని పిటిషనర్‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నారు. ఈ స్కీమ్‌‌‌‌ను ప్రకటించి ఓటర్లను మభ్యపెట్టి 99 మంది కాంగ్రెస్‌‌‌‌ అభ్యర్థులు ఎంపీలుగా గెలుపొందారని, వారిని అనర్హులుగా ప్రకటించాలని కోరారు. ఓటర్లకు డబ్బు ఆశ చూపడమంటే ప్రజా ప్రాతినిధ్య చట్టం– 1951ను ఉల్లంఘించడమేనన్నారు.