విమానం ఆటో పైలట్ మోడ్‌‌.. నిద్రపోయిన పైలట్లు

విమానం ఆటో పైలట్ మోడ్‌‌.. నిద్రపోయిన పైలట్లు

విమానం బయలుదేరినప్పటి నుంచి ల్యాండ్ అయ్యేంత వరకు పైలట్లు ప్రధాన భూమిక పోషిస్తుంటారు. ఏ మాత్రం అలక్ష్యం, నిర్లక్ష్యంగా ఉంటే.. అంతే సంగతులు. అందుకే పైలట్లు అప్రమత్తంగా ఉంటూ విమానాలను నడుపుతుంటారు. విమానాన్ని ఆటో పైలట్ మోడ్ లో ఉంచి ఇద్దరు పైలట్లు గుర్రు కొట్టారు. ఈ ఘటన ఈ నెల 15వ తేదీన ఇథియోపియాలో చోటు చేసుకుంది. సూడాన్ లోని ఖార్టూమ్ నుంచి ఇథియోపియో రాజధాని అడిస్ అబాబాకు ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ కు చెందిన  ET343 విమానం బయలుదేరింది. 37 వేల అడుగులో ఉండగా.. విమానాన్ని ఆటో పైలట్ మోడ్ లో ఉంచి ఇద్దరు పైలట్లు నిద్రపోయారు.

అబాబా విమానాశ్రయంలోని రన్ వేపై దిగాల్సి ఉంది. రన్ వే సమీపిస్తున్నా.. విమానం కిందకు దిగలేదు. ఏమి జరిగిందోనని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (EAC) ఆందోళన చెందింది. పైలట్లను అలర్ట్ చేసేందుకు ప్రయత్నించింది. వారిని సంప్రదించేందుకు ప్రయత్నించినా.. అవి సఫలం కాలేదు. విమానం ఎయిర్ పోర్టు దాటి వెళ్లింది. ఆటో పైలట్ మోడ్ ఆఫ్ కావడంతో అలారం మోగింది. ఈ శబ్దానికి పైలట్లు లేచి.. అసలు విషయాన్ని గుర్తించారు. దానిని వెనక్కి మళ్లించి.. రన్ వేపై ల్యాండ్ చేశారు. ఈ ఘటనలో ఎవరకీ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.