గండిపేట భూముల కేసులో మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడుకు ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. బ్రహ్మనాయుడును పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు తరలించే ముందు కాసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీస్ స్టేషన్ దగ్గరికి భారీగా వైసీపీ శ్రేణులు చేరుకోవడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ క్రమంలో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబుపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కనుసన్నల్లో తెలంగాణ ప్రభుత్వం నడుస్తోందని అన్నారు.
బ్రహ్మనాయుడుపై కావాలనే కుట్ర చేస్తున్నారు చేస్తున్నారని మండిపడ్డారు పిన్నెల్లి. ఇది ముమ్మాటికీ కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రేనని అన్నారు. పల్నాడు జిల్లాలో బ్రహ్మనాయుడు ఎన్ని వ్యాపారాలు చేసినా ఎలాంటి మచ్చ లేదని..అలాంటి వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేశారని అన్నారు. ఇది కూటమి ప్రభుత్వం చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ అని అన్నారు.
►ALSO READ | గండిపేట ఫేక్ జీవో కేసులో మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడుకు 14 రోజుల రిమాండ్...
ఈ రెండేళ్లలో చంద్రబాబు పీకింది లేదు.. చేసింది లేదని అన్నారు.ఏపీ లో చేస్తే ప్రజలు నమ్మరనే ఉద్దేశంతోనే.. తెలంగాణ ప్రభుత్వంతో కుమ్మక్కై చంద్రబాబు చేయించిన అరెస్ట్ ఇది అని అన్నారు పిన్నెల్లి.
ఎవరో దూరపు బంధువు ల్యాండ్ కొంటుంటే.. బ్రహ్మనాయుడు డబ్బు సహాయం మాత్రమే చేశాడని అన్నారు.ఏపీలో ప్రజా వ్యతిరేకతను డైవర్ట్ చేసేందుకే ప్రభుత్వం ఈ కుట్ర చేస్తోందని అన్నారు పిన్నెల్లి.
