16 టాటూలతో కోహ్లీ వీరాభిమాని ఇలా….

16 టాటూలతో కోహ్లీ వీరాభిమాని ఇలా….

ఇండియా వెస్టిండీస్ మూడో వన్డే కటక్ లో జరుగుతుంది. మూడో వన్డేలో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని ఇరు జట్లు పోటీపడుతున్నాయి. వన్డే మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు భారీగా తరలివచ్చారు. అయితే టీమిండియా కెప్టెన్ వీరాట్ కోహ్లీ అభిమాని ఒకరు అందరి దృష్టిని ఆకర్షించాడు స్టేడియంలో కొహ్లీ ఫోటో,జెర్సీ నంబర్ ఇలా ఏకంగా  శరీరంపై 16 పచ్చబొట్లు వేసుకుని వచ్చి చూపెట్టాడు. పింటు బెహెరా అనే అభిమాని వీరాట్ కోహ్లీకి పెద్ద ఫ్యాన్ . కోహ్లీ ఆట అంటే తనకెంతో ఇష్టమని అందుకే తనపై ఉన్న గౌరవాన్ని టాటూల రూపంలో చూపిస్తున్నానని అన్నాడు. ఈ టాటూలకు లక్ష రూపాయలు ఖర్చు పెట్టినట్లు చెప్పాడు.