చెక్ ​చేస్తే పిస్టల్​ దొరికింది

చెక్ ​చేస్తే పిస్టల్​ దొరికింది

శంషాబాద్, వెలుగు : మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాడుతున్న మహారాష్ట్రకు చెందిన కొందరిని సోదా చేయగా గన్​దొరికింది. సీఐ నరసింహ కథనం ప్రకారం..కాటేదాన్ పారిశ్రామికవాడలో ఒక కంపెనీలో ఆదివారం కొంతమంది పేకాడుతున్నారని సమాచారం రావడంతో పోలీసులు దాడి చేశారు. అనుమానం వచ్చి వారిని చెక్​చేయగా ఒకరి దగ్గర లోడ్​చేసిన కంట్రీమేడ్ పిస్టల్ దొరికింది.

ఒకవేళ పోలీసులు దాడి చేస్తే తప్పించుకోవడానికి పిస్టల్​తెచ్చుకుని ఉండవచ్చని అనుమానిస్తున్నారు. కానీ అలా జరగకపోవడంతో మిగతా కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. పిస్టల్ సీజ్ చేసి నలుగురిని అరెస్టు చేశారు. వీరంతా పారిశ్రామిక వాడలోని ఓ కంపెనీలో పని చేస్తున్నారని తెలిసింది.