
హామ్స్ టెక్ థర్డ్ యాన్యువల్ ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్ శనివారం మాదాపూర్ లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రారంభమైంది . పిక్సెల్ పర్ పెక్ట్–2019 ఏర్పాటైన ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్ లో దాదాపు 40 మంది స్టూడెంట్స్ పాల్గొ న్నారు. హామ్స్ టెక్ ఫొటోగ్రఫీ స్టూడెంట్స్ కి ఒక అవకాశాన్ని కల్పిస్తూ, వారిలోని స్కిల్స్ ని వెలికితీసేందుకు ఏర్పాటు చేశామని ప్రొఫెసర్ ఎస్ కే రెహమాన్ తెలిపారు. ఈ ఏడాది నేచర్, స్ట్రీట్, ట్రావెల్, ఆర్కిటెక్చర్ వంటి థీమ్స్ తో ఫొటోలను తీసి ఎగ్జిబిట్ చేస్తున్నారన్నారు. విద్యార్థు లు తీసిన ఫొటోలు ఎంతో ఆకర్షణీయంగా, ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి.