యాడ్ లెజెండ్, పద్మశ్రీ పీయూష్ పాండే కన్నుమూత

యాడ్ లెజెండ్, పద్మశ్రీ పీయూష్ పాండే కన్నుమూత

భారతీయ అడ్వర్టైజ్​ మెంట్​ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన యాడ్ లెజెండ్ పియూష్ పాండే (Piyush Pandey) కన్నుమూశారు. 70 ఏళ్ల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు. అబ్కీ బార్ మోడీ సర్కార్ నుంచి వోడాఫోన్ జూజూస్ వరకు భారతీయ యాడ్స్​ రూపొందించి అడ్వర్టైజ్​ మెంట్​ రంగంలో లెజెండ్​ అనిపించుకున్నారు పియూష్ పాండే.ఆయన మరణం ప్రకటనల ప్రపంచంలోనే కాకుండా, మొత్తం క్రియేటివ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

అడ్వర్​ టైజ్​ మెంట్​ రంగంలో ప్రసిద్దులు.. అడ్వర్టైజ్​ మెంట్​ దిగ్గజం , పద్మశ్రీ అవార్డు గ్రహీత పీయూష్​ పాండే (70) ముంబైలో కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పాండే ఆరోగ్యం క్షీణించడంతో  శుక్రవారం (అక్టోబర్​24) ఉదయం తుదిశ్వాస విడిచారు. పాండే మరణవార్తను ఆయన సోదరి నటి ఇలా అరుణ్​ధృవీకరించారు. ఆయన అంత్యక్రియలు ముంబైలోని శివాజీ పార్క్‌లో నిర్వహించనున్నారు. 

నాలుగు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో..పాండే భారతీయ అడ్వర్టైజ్​మెంట్ రంగంలో రాణించారు. ప్రకటనలకు కంటెంట్​ అందించారు. వాయిస్​ ఓవర్​ ఇచ్చారు. యాడ్స్​ లో నటించారు. దేశంలో అత్యంత గుర్తింపు పొందిన ప్రకటనలను రూపొందించారు. 

మనం టీవీల్లో చూసే ఫెవికాల్ యాడ్​, ఏషియల్​ మెంట్​ యాడ్​, క్యాడ్​ బరీ డైరీ మిల్క్​, వోడాఫోన్ కు ది పగ్ , జూజూస్,బజాజ్ కంపెనీకి - 'హమారా బజాజ్, 2014లో మోదీ నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు తోడ్పడిన నినాదం అబ్కీబార్​  మోదీ సర్కార్​ నినాదం  వంటి ప్రముఖ యాడ్​ కంటెంట్​ ను అందించారు పీయూష్​ పాండే. 

ఫెవికాల్ - బలమైన బంధాలకు చిహ్నం అంటూ ఫెవికాల్​ యాడ్​, హర్​ ఘర్​ కుచ్​ కెహ్తాహై అంటూ ఏషియన్​ పెయింట్స్​, తోడో నహీన్​ జోడో ప్రచార నినాదంతో ఫెవిక్విక్​ వంటి కంపెనీలకు యాడ్స్​ కంటెంట్​ రూపొందించారు పీయూష్​ పాండే. 

2014లో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు కీరోల్​ పోషించిన ఎన్నికల ప్రచార నినాదం.. అబ్కీ బార్ మోడీ సర్కార్ ను రూపొందించిని పీయూష్​ పాండేనే.  ఆయన క్రియేట్​ చేసిన పొలిటికల్​ రచనల్లో అత్యంత ప్రాధాన్యత పొందింది. ఈ వాక్యం దేశవ్యాప్తంగా ఓ పల్లవిగా మారింది .భారత రాజకీయ కమ్యూనికేషన్‌లో ఓ మలుపు తిప్పింది. ప్రజాభిప్రాయాన్ని పదునైన సందేశంతో మిళితం చేసింది. రాజకీయ భావాలను సరళమైన, చిరస్మరణీయ నినాదంగా అనువదించగల అతని సామర్థ్యం.. భారతీయ ప్రేక్షకుల పట్ల అతని సాటిలేని అవగాహనను ప్రదర్శించింది.

ప్రముఖ రంగుల కంపెనీ ఏషియన్​ పెయింట్స్​ కు కూడా అడ్వర్టైజ్​ మెంట్లు రూపొందించింది పీయూష్​ పాండేనే. హర్ ఘర్ కుచ్ కెహ్తా హై" అనేది పీయూస్​ చేసిన అత్యంత భావోద్వేగం ప్రతిధ్వనించే రచనలలో ఒకటి. ప్రతి ఇల్లు ఒక కథ చెబుతుందనే ఆలోచనపై ఈ ప్రకటనలు భారతదేశం అంతటా కుటుంబాలు ,ఇంటి యజమానులమనుసులలోకి లోతుగా వెళ్లింది.ఈ అడ్వర్టైజ్​ మెంట్ రచనతో ఆసియన్ పెయింట్స్‌ను బ్రాండ్ కంపెనీగా మారింది.