
జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్ తెలుగు టైటాన్స్ ఐదో విజయం అందుకుంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 30–29తో గుజరాత్ జెయింట్స్‌పై థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. టైటాన్స్ జట్టులో ఆల్‌రౌండర్ భరత్ 9 పాయింట్లతో మరోసారి సత్తా చాటగా.. కెప్టెన్ విజయ్ మాలిక్ (7) , డిఫెండర్లు శుభం షిండే (4), అంకిత్ (3) కూడా రాణించారు.
గుజరాత్ తరఫున ఆల్‌రౌండర్ మొహమ్మద్‌రెజా షాద్లోయి (6), రైడర్ ఆర్యవర్ధన్ నవాలే (4) పోరాడారు. 10 మ్యాచ్‌ల్లో ఐదో విజయంతో టైటాన్స్ 10 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. దాంతో గుజరాత్ జెయింట్స్ ఏడో ఓటమితో పట్టికలో 12వ స్థానంలో కొనసాగుతోంది. మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ టై బ్రేక్‌లో 6–4తో యు ముంబాను ఓడించింది. ఇరు జట్లూ నిర్ణీత సమయంలో 38–38తో సమంగా నిలవగా.. ఐదు రైడ్ల టై బ్రేక్‌లో జైపూర్ పైచేయి సాధించింది.