హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విమెన్స్ రెడీ

  హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  కు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విమెన్స్ రెడీ

న్యూఢిల్లీ:  ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐహెచ్ విమెన్స్ హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడీ అవుతోంది. ఈ టోర్నీలో ఇండియా పూల్–-బిలో బరిలో నిలిచింది.  మార్చి 8న ఉరుగ్వేతో జరిగే తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో  తన పోరు  ప్రారంభిస్తుంది. 

ఆ తర్వాత  9న స్కాట్లాండ్, 11న వేల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో గ్రూప్ దశ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఆడుతుంది. పూల్–ఎలో ఇంగ్లండ్, కొరియా, ఇటలీ, ఆస్ట్రియా జట్లు పోటీ పడుతున్నాయి. మార్చి 13న సెమీఫైనల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 14న ఫైనల్ షెడ్యూల్ చేశారు. గతేడాది ఆసియా కప్ ఫైనల్లో ఓడి నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని కోల్పోయిన ఇండియాకు హైదరాబాద్ గడ్డపై జరిగే ఈ టోర్నీ వరల్డ్ కప్ బెర్తు ఖరారు చేసుకోవడానికి చివరి అవకాశం కానుంది.