
న్యూఢిల్లీ: కరో్నా రోజురోజుకీ విజృంభిస్తున్నందున వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటుపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్దన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది జూలైకి 25 కోట్ల మందికి వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్రం ప్లాన్ చేస్తోందని హర్ష వర్దన్ తెలిపారు. ముందుగా ఎవరెవరకి వ్యాక్సినేషన్ చేయాలనే లిస్ట్‌ను ప్రాధాన్యతల వారీగా రూపొందించి పంపాల్సిందిగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించామన్నారు. లిస్ట్‌లో ఉండే ముందు వరుసలో ఉండే హెల్త్ వర్కర్ల (పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్ ఎంప్లాయీస్)కు వచ్చే ఏడాది అక్టోబర్‌కల్లా వ్యాక్సినేషన్ పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. వ్యాక్సిన్ అందుబాటుపై దేశంలోని వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలతో చర్చలు జరుపుతున్నామని, వారికి పూర్తి సహకారాన్ని అందిస్తున్నామని చెప్పారు.