తిరుపతిలో 12 అంతస్తులతో ఇంటిగ్రేడ్ బస్టాండ్ 

తిరుపతిలో 12 అంతస్తులతో ఇంటిగ్రేడ్ బస్టాండ్ 
  • ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు

చిత్తూరు: తిరుపతి బస్టాండ్ ను 12 అంతస్తులతో ఇంటిగ్రేడ్ బస్టాండ్ గా మార్చేందుకు ప్రతిపాదనలు రెడీ చేసినట్లు ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. అలాగే తిరుమలకు 50 బ్యాటరీ బస్సు సర్వీసులు నడపాలని నిర్ణయించామని.. అలాగే తిరుమలతోపాటు ఇతర ప్రాంతాలకు మరో 50 బ్యాటరీ బస్సు సర్వీసులు నడుపుతామని ఆయన తెలిపారు. కరోనా కారణంగా ఆర్టీసీ తీవ్రంగా నష్టపోయిన మాట వాస్తవమేనని.. బ్యాటరీ ఆర్టీసీ బస్సులు నడవడం వల్ల పర్యావరణాన్ని కాపాడినట్లేనని ఆయన పేర్కొన్నారు. 
థర్డ్ వేవ్ కరోనాపై అప్రమత్తంగా ఉన్నాం
కరోనా థర్డ్ వేవ్ ప్రబలితే ఎదుర్కొనేందుకు తగిన ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నామని.. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ప్రస్తుతం ఏసీ బస్సులతో పాటు ప్రతి బస్సును శానిటైజ్ చేస్తున్నామని ఆయన తెలిపారు. మాస్కులు ధరిస్తేనే ఆర్టీసీ బస్సులోకి ఎక్కనిస్తున్నామని ఆయన వివరించారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ ను మరింత అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని ఆయన వివరించారు.