జ్యోతిష్య శాస్త్రం ప్రకారం భీష్మ ఏకాదశి.. జయ ఏకాదశి రోజున జనవరి 29 న ఎంతో శక్తివంతమైన రవి యోగం ఏర్పడబోతోంది . భీష్మ ఏకాదశి రోజు అంటే 2026 జనవరి 29న సూర్యుడు ... కుజుడు కలిసి ఒకే రాశిలో సంచరించే సమయంలో రవియోగం ఏర్పడుతుంది. ఈ యోగం ఎఫెక్ట్ తో కొన్ని రాశుల వారికి ఊహించని ధన లాభాలతో పాటు అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా మేషం, సింహం, కుంభం , తులా రాశుల వారికి అధికార యోగం ఏర్పడనుందని జ్యోతిష్య పండితుల అంచనా . ఈ రాశులతో పాటు మిగతా రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
మేష రాశి: రవి యోగం వలన ఈ రాశి వారికి జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. రాజకీయాల్లో ఉన్నవారు అనుకున్న విజయం సాధిస్తారు. వ్యాపారులు లాభాలు పొందుతారు.
పూర్వీకుల ఆస్తి కలసి వస్తుంది. ఉద్యోగంలో పురోగతితో పాటు అధికారుల ప్రశంశలు అందుకుంటారు. కెరీర్ విషయంలో మంచి నిర్ణయం తీసుకుంటారు. సహోద్యోగులవిషయంలో అప్రమత్తంగా ఉండండి.
వృషభరాశి : ఈ రాశి వారు సోమరితనాన్ని పూర్తిగా వదిలేయాలి. కొత్తప్రణాళికలు అమలు చేస్తారు. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. కొన్నిశుభవార్తలు వింటారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో పూర్తి మద్దతు ఉంటుంది. కుటుంబ సభ్యులంతా కలిసి మెలిసి ఉంటారు. మీ వ్యక్తిత్వం ఆకర్షణీయంగా మారుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కళలు, మీడియా, ఫ్యాషన్ రంగాల్లో ఉన్న వారికి భారీ డీల్స్ కుదురుతాయి. సంపదను కూడబెట్టడంలో మీరు విజయం సాధిస్తారు.
మిథునరాశి : కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. ఇంటి వాతావరణం ఆనందంగా ఉంటారు. వ్యాపారాన్ని విస్తరించడానికి ప్రణాళికలు వేస్తారు. సాంకేతిక రంగంపై దృష్టి పెడుతారు. బ్యాంకురుణం తీసుకునేవారు పత్రాలను రెడీ చేసుకుంటారు. విశేషమైన ప్రయోజనాలను, లాభాలను పొందుతారు. కుజుడి అనుగ్రహం వీరికి బాగా లభిస్తుంది. ఉద్యోగస్థులకు పదోన్నతి ఉంది. అన్ని సమస్యలకు ఈ సమయంలో పరిష్కారాలు దొరుకుతాయి.
కర్కాటకరాశి : ఉద్యోగులు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని పనులపై కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. ఎంత కష్టపడితే అంత ఫలితం దక్కుతుంది. ఏ పని తలపెట్టినా విజయం లభిస్తుంది. డబ్బులు బాగా సంపాదిస్తారు. అందుకు అదృష్టం కూడా వీరికి తోడుంటుంది. అన్నిరంగాల్లోను తిరుగులేని విధంగా ఉంటుంది. విద్యార్థులకు బాగుంటుంది. ఉద్యోగస్థులకు పదోన్నతితోపాటు కార్యాలయంలో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో ఆర్థిక లాభాలు వస్తాయని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
సింహ రాశి : రవి యోగం వలన ఈ రాశి వారికి ఉద్యోగస్తలకు ప్రమోషన్ తో పాటు వేతనం పెరిగే అవకాశం ఉంది. చేపట్టిన పనులలో అద్భుతమైన విజయం లభిస్తుంది. విలాసవంతమైన జీవితంపై ఆసక్తి పెరుగుతుంది. ఇల్లు .. వాహనం కొనాలనే మీ కల నెరవేరుతుంది. పూర్వీకుల ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టేవారు ఈ సమయంలో పెడితే భారీ మొత్తంలో లాభాలను కూడగట్టే అవకాశం ఉంది. కొత్తగా ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యుల్లో సంతోషం నెలకుంటుంది. సమాజంలో గౌరవం కలుగుతుంది. వ్యాపార సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది.
కన్య రాశి : రవియోగం వలన ఈ రాశి వారికి పెండింగులో ఉన్న పనులు పూర్తి చేస్తారు. తండ్రి సహాయంతో పూర్తి చేస్తారు. గొడవలు పరిష్కారమవుతాయి. ఆర్థికవిషయాల్లో మెరుగైన ఫలితాలను సాధిస్తారు. ఉద్యోగులకు అధికారుల సపోర్ట్ ఉంటుంది. పాత ప్రాజెక్టుల్లో విజయాన్ని సాధిస్తారు. కొత్త నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఉద్యోగులకు ప్రమోషన్ రావచ్చు. పెండింగ్‌లో ఉన్న టాస్కులను పూర్తిచేసే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.
తులా రాశి : రవియోగం ప్రభావం కారణంగా ఆర్థికంగా బలపడే అవకాశం ఉంది. ఈ యోగం బాగా కలిసి వచ్చేలా చేస్తుంది. ఈ సూర్యుడు.. కుజుడు గ్రహాల కలయికతో ఏర్పడే ఈ యోగం శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారి అదృష్టం పెరుగుతుంది. సక్సెస్‌ను అందుకుంటారు. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. అయితే కోపం, మాటలను అదుపులో ఉంచుకోవాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
వృశ్చికరాశి : రవియోగం ఎఫెక్ట్ తో ఈ రాశి వారికి మనస్సు కొంచెం కలత చెందే అవకాశం ఉంది. . ఆత్మవిశ్వాసం లోపిస్తున్నట్లు అనిపిస్తుంది. చిన్న విషయాలకు కూడా ఆందోళన చెందుతారు. మానసికంగా మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడం చాలా అవసరమని పండితులు హెచ్చరిస్తున్నారు. వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగస్తులు అనవసరంగా మాట పడే అవకాశం ఉంది. ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకోండి..
ధనుస్సురాశి :రవి యోగం ఎఫెక్ట్‌తో ఉద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారులు నూతనోత్సాహంతో పనిచేస్తారు. పాత స్నేహితులను కలుస్తారు. అయితే, కొన్నిసార్లు మనస్సు కలవరపడవచ్చు. అనవసరమైన కోపాన్ని నివారించండి, లేకపోతే సంబంధాలు దెబ్బతింటాయి. కుటుంబానికి సంబంధించిన కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే సంకేతాలు కనిపిస్తాయి. ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి.
మకరరాశి : రవి యోగం వలన ఈ రాశి వారికి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నించడం మంచిదని పండితులు చెబుతున్నారు. . ఎటువంటి పోటీ పరీక్షలు, రాత పరీక్షల్లోనైనా వీరు నెగ్గే అవకాశం ఉంది. ఉన్నత పదవులు లభించే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి ఆశించిన గుర్తింపు లభిస్తుంది.సమాజంలో గౌరవం .. కీర్తి.. ప్రతిష్టలు పెరుగుతాయి. కార్యాలయంలో సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వ్యాపారస్తులు ఆనందంగా గడుపుతారు. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. సంతాన యోగం కలుగుతుంది. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి.
కుంభ రాశి : ఈ రాశి వారికి రాజయోగం పట్టే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఆస్తి సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి, సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు బాగా అనుకూలంగా ఉంటుంది. వేతనం పెరగడం.. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్ రావడం.. కావలసిన ప్రదేశానికి ట్రాన్సఫర్ అయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశాల్లో జాబ్ లభించే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం.. కీర్తి.. ప్రతిష్టలు వృద్ది చెందుతాయి. వ్యాపారస్తులు అధికంగా లాభాలు పొందుతారు. కొత్త పెట్టుబడులు పెట్టేందుకు.. బిజినెస్ ను విస్తరించే అనుకూల సమయమని పండితులు చెబుతున్నారు.
మీనరాశి: ఈ రాశి వారికి రవియోగం ..బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు వివిధ లాభాలను పొందుతారు. కెరీర్‌లో ఊహించని మార్పులను చూస్తారు. వ్యాపారంలో కూడా బాగా కలిసి వస్తుంది. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. ఆదాయం పెరుగుతుంది. సానుకూల మార్పులు కనిపిస్తాయి. మీరు కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి. అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. సంతోషం పెరుగుతుంది.
