
నేరడిగొండ, వెలుగు: నేరడిగొండ మండలంలోని వడూర్, బుద్ధికొండ, వాగ్దారి తదితర గ్రామాలకు వెళ్లే రోడ్లకు ఇరువైపులా 20 రోజుల క్రితం అటవీశాఖ ఆఫీసర్లు మొక్కలు నాటారు. కానీ నిర్వహణ మరిచారు. నీళ్లు పోయకపోవడంతో ఆ మొక్కలు ఎండిపోతున్నాయి.
ఇక బోథ్ ఎక్స్ రోడ్ నుంచి వాగ్దారి గ్రామానికి వెళ్లే రోడ్డుకు ఇరువైపులా నాటేందుకు తీసుకొచ్చిన మొక్కలను నాటకుండా అక్కడే వదిలేశారు. నీరు లేక ఈ మొక్కలు కూడా ఎండిపోతున్నాయి. ఇప్పటికైనా ఆఫీసర్లు స్పందించి మొక్కలకు నీరందించి సంరక్షించాలని ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు.