‘కరోనాను తగ్గించడంలో ప్లాస్మా అంతగా పనిచేయలేదు’

‘కరోనాను తగ్గించడంలో ప్లాస్మా అంతగా పనిచేయలేదు’
  • వెల్లడించిన ఎయిమ్స్‌ డాక్టర్లు

న్యూఢిల్లీ: కరోనాను తగ్గించడంలో, మోర్టాలిటీ రేట్‌ తగ్గించడంలో ప్లాస్మా ట్రీట్‌మెంట్‌ అంతగా ప్రభావం చూపలేదని ఎయిమ్స్‌ డాక్టర్లు చెప్పారు. ఎయిమ్స్‌లో ర్యాండమ్‌గా ఇంటరిమ్‌ ఎనాలసిస్‌ చేయడం ద్వారా ఇది వెల్లడైందని అన్నారు. దాదాపు 30 మంది కరోనా పేషంట్లపై ట్రయల్‌ నిర్వహించామని ఎయిమ్స్‌ డైరెక్టర్‌‌ డాక్టర్‌‌ రణదీప్‌గులేరియా చెప్పారు. ట్రయల్స్‌లో భాగంగా స్టాండర్డ్‌ ట్రీట్‌మెంట్‌తో పాటు సపోర్టివ్‌ ట్రీట్‌మెంట్‌ ఇచ్చామని, మరి కొంత మందికి స్టాండర్డ్‌ ట్రీట్‌మెంట్‌ ఇచ్చామని, రెండు రకాల పేషంట్లకు ఒకే రకమైన రిజల్ట్‌ వచ్చిందని అన్నారు. “ ఏది ఏమైనా ఇది కేవలం ఇంటరిమ్‌ ఎనాలసిస్‌ మాత్రమే. ఇంకా దీనిపై వివరంగా ఎనాలసిస్‌ చేయాల్సి ఉంది” అని ఆయన అన్నారు. ప్లాస్మా ట్రీట్మెంట్‌ కంటే ముందు దాన్ని టెస్ట్‌ చేయాలని, సేఫ్టీ, యాంటీబాడీస్‌ని టెస్ట్‌ చేయాలని అన్నారు. కరోనా నుంచి కోలుకున్న వారిలో యాంటీబాడీస్‌ ఉంటాయి. ఈ నేపథ్యంలో వారి ప్లాస్మా ద్వారా ఈ థెరపీ చేసి ట్రీట్‌మెంట్‌ చేస్తారు.