ప్లాట్​ఫామ్ టికెట్ ధర 30కి పెంపు

ప్లాట్​ఫామ్ టికెట్ ధర 30కి పెంపు

న్యూఢిల్లీ: ప్రయాణికులకు ఇండియ న్ రైల్వేస్ షాకిచ్చింది. టికెట్​ చార్జీ లను భారీగా పెంచింది. ప్లాట్ ఫాం టికెట్ ధరను రూ.10 నుంచి 30 రూపాలయలకు పెంచుతున్నట్లు రైల్వే శాఖ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. పెంపు దేశవ్యాప్తం గా వెంటనే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. దీంతో పాటు లోకల్ ట్రైన్లలో మినిమమ్ టికెట్ రేటును రూ.10 నుంచి రూ.30 కి పెంచు తున్నట్లు ప్రకటించింది. చార్జీల పెంపు తాత్కాలికమేనని, దేశంలో మరోసారి విజృంభిస్తున్న కరోనాకు అడ్డుకట్ట వేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. స్టేషన్లలో రద్దీని తగ్గించేందుకు చార్జీలను పెంచినట్లు తెలిపింది. ప్లాట్ ఫాం టికెట్ల రేటును మార్చే అధికారాన్ని స్టేషన్ డీఆర్ఎమ్ లకు అప్పగిస్తున్నట్లు పేర్కొంది.