తోటి సింగర్స్ కు సాయం చేయాలని 64 రోజులు పాటలు పాడిన సింగర్

తోటి సింగర్స్ కు సాయం చేయాలని 64 రోజులు పాటలు పాడిన సింగర్

కరోనా వల్ల దేశమంతా ఆగమాగమయింది. ఎంతోమంది పనులు లేక రోడ్డునపడ్డారు. అలా తనకు సంబంధించిన వారు ఇబ్బందిపడకూడదని ఓ గాయకుడు 64 రోజులు పాటలు పాడి రూ. 15 లక్షలు సంపాదించాడు. చెన్నైకి చెందిన ప్లేబ్యాక్ సింగర్ సత్యన్ మహాలింగం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాడు. కరోనా వ్యాప్తితో లాక్డౌన్ విధించారు. దాంతో సంగీత పరిశ్రమకు చెందిన వారు పనులు లేక చాలా ఇబ్బందులు పడ్డారు. అవన్నీ చూసిన సత్యన్.. తన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ ఖాతాలలో ‘సత్యన్ ఉత్సవ్’పేరుతో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించాడు. ఆ ప్రోగ్రాంలో సత్యన్ 64 రోజుల పాటు ప్రత్యక్షంగా పాటలు పాడాడు. దాంతో అతనికి రూ. 15 లక్షలు వసూల్ అయ్యాయి. ఈ మొత్తాన్ని తన తోటి సింగర్స్ కు హెల్స్ చేయడానికి ఉపయోగిస్తానని సత్యన్ తెలిపారు. సంగీత పరిశ్రమకు చెందిన వారికోసం ఈ ప్రోగ్రాం రూపొందించారు కాబట్టి దీనిని ‘మ్యూజిక్ 4 మ్యూజిషియన్స్’ అని పిలుస్తున్నారు.

‘లాక్డౌన్ కు ముందు ఒక నెలలో 40 నుండి 45 ప్రోగ్రామ్‌లను చేసేవాళ్లం. అప్పుడు మా ఆదాయం రూ .50,000 లకు అటుఇటుగా ఉండేది. లాక్‌డౌన్ పెట్టడం వల్ల మా ఆదాయం మొత్తం తగ్గిపోయింది. నేను సంగీత పరిశ్రమకు చెందినవాడిని కాబట్టి సంగీత పరిశ్రమ వాళ్లు బతకడం ఎంత కష్టమో నాకు తెలుసు. అందుకే నేను నాతోటి వారికి ఏదైనా చేయాలనుకున్నాను. అందుకోసమే ‘మ్యూజిక్ 4 మ్యూజిషియన్స్’ పేరిట 64 రోజుల పాటు పాటల ప్రదర్శన ఏర్పాటుచేశాను. ఈ ప్రోగ్రాం ద్వారా స్టేజ్ లైట్ మ్యూజిక్ ఆర్టిస్టులకు సహాయం చేయడానికి మే 30న 25 గంటల పాటు నిరంతరంగా పాటలు పాడాను’అని మహాలింగం తెలిపారు.

For More News..

పీవీ గురించి మాట్లాడాలంటే ధైర్యం కావాలి

బతికున్న శిశువును చనిపోయాడని కవర్లో చుట్టిన ఆస్పత్రి సిబ్బంది

కోట్ల రూపాయల వద్దనుకుంటున్న సెలబ్రిటీలు