వర్షం నీళ్లలో ఆడుతున్నారా.. అయితే రోగాలను ఆడు'కొని' తెచ్చుకున్నట్టే

వర్షం నీళ్లలో ఆడుతున్నారా.. అయితే రోగాలను ఆడు'కొని' తెచ్చుకున్నట్టే

ఈ వర్షాకాలంలో ఎక్కడ చూసినా వరద, బురదతో కూడిన ప్రాంతాలు చాలానే కనిపిస్తాయి. ఈ క్రమంలో కొంతమంది నిలిచిపోయిన ఈ నీటికి దూరంగా ఉండటానికి బదులుగా, ఆడటానికి, ఆనందించడానికి ఇష్టపడతారు. అయితే ఇది మలేరియా, కలరా లాంటి ఇతర వ్యాధులకు కారణమవుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇది ప్రమాదకరం కాబట్టి ప్రజలు ఈ చర్యకు దూరంగా ఉండాలని ట్వీట్ చేశారు.

“ఈ రోజుల్లో మలేరియా, కలరా సర్వసాధారణం. నీరు, చర్మ సంబంధిత సమస్యలకు కూడా ఇది దారి తీస్తుంది. పరిస్థితి తీవ్రతను ప్రజలు అర్థం చేసుకోవాలి' అని ఇందిరా గాంధీ హాస్పిటల్ (ఢిల్లీ ప్రభుత్వం) డాక్టర్ ఓం ప్రకాష్ ఝాకర్ అన్నారు. ప్రజలు, పిల్లలను నీటి నిల్వలకు దూరంగా ఉంచాలని ఢిల్లీ హోంగార్డులకు కూడా ఇటీవలే ఆదేశాలు జారీ చేశారు. చర్మ దద్దుర్లు, చర్మ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందని అపోలో ఇంద్రప్రస్థ హాస్పిటల్‌లోని ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ సురంజిత్ ఛటర్జీ తెలిపారు.

"శరీరంలోకి నీరు చేరినట్లయితే, లెప్టోస్పిరోసిస్‌ సంక్రమించవచ్చు. ఇది ప్రాణాంతక వ్యాధి" వైద్యులు చెబుతున్నారు. నీటి నిల్వల వల్ల కలరా, డయేరియా, లెప్టోస్పైరోసిస్ వంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయన్నారు. కాబట్టి వర్షపు నీటిలోకి వెళ్లడం క్షేమకరం కాదని వైద్యులు సూచిస్తున్నారు.

 

I urge everyone to avoid this. It cud be fatal. https://t.co/en3dRHMgW1

— Arvind Kejriwal (@ArvindKejriwal) July 15, 2023