మీ బిడ్డను తప్పించేందుకు నా కొడుకుతో ఆడుకుంటున్నారు : మల్లన్న తల్లి

మీ బిడ్డను తప్పించేందుకు నా కొడుకుతో ఆడుకుంటున్నారు : మల్లన్న తల్లి

తీన్మార్ మల్లన్నను నిజాలు చెప్తున్నాడని, జైలుకు తీసుకెళ్లారని ఆయన తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. అర్థరాత్రి తన కొడుకును అరెస్టు చేశారని ఆరోపించారు. అరెస్టుకు ముందు నోటీసులు కూడా జారీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌడీల్లా, దొంగల్లా వచ్చి తన కొడుకును తీసుకెళ్లారన్నారు. సీఎంను అన్నా అంటూ సంభోదించిన మల్లన్న తల్లి.. మీక్కూడా కొడుకులు, బిడ్డలు ఉన్నారు కదా.. అంటూ ఎమోషనల్ అయ్యారు. మీ బిడ్డను ఈ రోజు ఈడీ అధికారులు తీసుకెళ్తే ఎంత బాధపడ్డున్నారు అని ఆమె కామెంట్ చేశారు.

మీ బిడ్డను తప్పించేందుకు తన కొడుకుతో ఆడుకుంటున్నారని మల్లన్న తల్లి ఆరోపణలు చేశారు. అది ఎంత వరకు న్యాయం అని నిలదీశారు. తన కొడుకు నిజంగా తప్పు చేస్తే.. తానే అతన్ని తీసుకెళ్లమని చెప్తామన్నారు. ఏ తప్పూ చేయని మల్లన్నను అరెస్టు చేశారని ఆమె చెప్పారు. కరోనా సమయంలో చాలా మందికి తినడానికి తిండి దొరకని వారికి హాస్పిటల్స, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు వద్ద భోజనం పెట్టాడని, అలా చేయడం కూడా తప్పేనా అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాచలంలో వర్షాలు పడి ఇళ్లన్నీ కూలిపోతే.. వాళ్లకు మల్లన్న తోచిన సాయం చేశారన్నారు. దవాఖానల్లో సరైన వసతులు, డాక్టర్లు లేక హార్ట్ పేషెంట్స్ ఇబ్బంది పడుతుంటే.. వాళ్లకు ఆపరేషన్లు కూడా చేయించాడని మల్లన్న తల్లి భావోద్వేగపూరిత ప్రసంగం చేశారు.

https://youtu.be/mi7Ou6LdYIc