
జీడిమెట్ల, వెలుగు: కొంపల్లి నుంచి బహదూర్‌పల్లి వరకు నిర్మిస్తున్న వంద ఫీట్ల రోడ్డులో ఇండ్లు, వ్యాపార సముదాయాలు కోల్పోతున్న వారికి అండగా ఉంటామని మంత్రి శ్రీధర్బాబు హామీ ఇచ్చారు. దూలపల్లిలోని మైనంపల్లి నివాసంలో బుధవారం ఆయన బాధిత కుటుంబాలతో మాట్లాడారు. పట్టణ అభివృద్ధిలో భాగంగా రోడ్డు విస్తరణ పనులకు అందరూ సహకరించాలని కోరారు. భూములు కోల్పోయిన వారికి పరిహారం ఇచ్చేందుకు సీఎం చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, శ్రీశైలంగౌడ్ పాల్గొన్నారు.