దాడికి మూడు రోజుల ముందే మోడీకి తెలుసు.. అందుకే ఆయన కాశ్మీర్ వెళ్లలే: ఖర్గే సంచలన వ్యాఖ్యలు

దాడికి మూడు రోజుల ముందే మోడీకి తెలుసు.. అందుకే ఆయన కాశ్మీర్ వెళ్లలే: ఖర్గే సంచలన వ్యాఖ్యలు

రాంచీ: పహల్గాం ఉగ్రదాడి ఘటన యావత్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వేళ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం (మే 6) జార్ఖండ్‎లో పర్యటించిన ఖర్గే ఓ సమావేశంలో మాట్లాడుతూ.. పహల్గాం ఉగ్రదాడి జరగడానికి 3 రోజుల ముందే జమ్మూ కాశ్మీర్‎లో టెర్రరిస్ట్‎లు దాడికి పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు ప్రధాని మోడీకి సమాచారం అందించాయి. టెర్రర్ ఎటాక్ జరగొచ్చనే ఇంటలిజెన్స్ వర్గాల సూచనతోనే మోడీ జమ్మూ పర్యటన క్యాన్సిల్ చేసుకున్నారు. ఉగ్రదాడిపై నిఘా వర్గాలు ముందుగా హెచ్చరించినప్పటికీ.. దానికి తగిన భద్రత చర్యలు ఎందుకు తీసుకులేదు.. ప్రజలను ఎందుకు అప్రమత్తం చేయలేదని ప్రశ్నించారు.

‘‘పహల్గాం ఉగ్రదాడిలో ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉందని అఖిలపక్ష సమావేశంలో కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వం అంగీకరించింది. అయితే.. ఉగ్రదాడికి మూడు రోజుల ముందే జమ్మూలో టెర్రర్ ఎటాక్ జరగొచ్చని ప్రధాని మోడీకి ఇంటెలిజెన్స్ నివేదిక పంపించిందని నాకు సమాచారం అందింది. అందువల్లే ఆయన కాశ్మీర్ పర్యటన కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. మరీ.. ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని ఇంటెల్ ఉన్నప్పుడు.. ప్రభుత్వం ప్రజలను ఎందుకు అలర్ట్ చేయలేదు..? నిఘా వర్గాల సూచనల మేరకు ఎందుకు తగిన రక్షణ చర్యలు తీసుకోలేదు అన్నది మా ప్రశ్న’’ అని ఖర్గే వ్యాఖ్యానించారు. 

►ALSO READ | జడ్జిల ఆస్తుల వివరాలు అధికారిక వెబ్ సైట్ లో.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..

జమ్మూ కాశ్మీర్‎లోని కాత్రా నుంచి శ్రీనగర్‌ మధ్య నడిచే రైలు సర్వీసును ఏప్రిల్ నెలలో ప్రధాని మోడీ ప్రారంభించాల్సి ఉంది. అయితే.. కాత్రా ప్రాంతంలో ప్రతికూల వాతావరణం కారణంగా ఏప్రిల్ 19న జరగాల్సిన ప్రధాని మోడీ జమ్మూ కాశ్మీర్ పర్యటన వాయిదా పడింది. ప్రధాని టూర్ క్యాన్సిల్ అయిన సరిగ్గా మూడు రోజులకే జమ్మూ కాశ్మీర్‎లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగింది. 

టెర్రరిస్టులు సృష్టించిన నరమేధంలో 26 మంది అమాయక టూరిస్టులు మరణించారు.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రధాని పర్యటన వాయిదా పడ్డ మూడు రోజులకే ఈ దాడి జరగడం చర్చనీయాంశంగా మారింది. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరించడంతోనే మోడీ తన టూర్ క్యాన్సిల్ చేసుకున్నాడని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడా ఇదే పాయింట్ రైజ్ చేశారు.