ఇయ్యాల రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ పైసలు

V6 Velugu Posted on Aug 09, 2021

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) స్కీమ్ పైసలు రైతుల ఖాతాల్లో సోమవారం జమ కానున్నాయి. ఈ స్కీమ్ కింద 9వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేస్తారని పీఎంఓ ఆదివారం పేర్కొంది. మొత్తం 9.75 కోట్ల మంది రైతులకు పైగా, ఒక్కొక్కరికి రూ.2 వేల చొప్పున రూ.19,500 కోట్లను రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా ప్రధాని రైతులతో ఇంటరాక్ట్ అవుతారని తెలిపింది. పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం ఒక్కో రైతుకు ఏడాదికి రూ.6 వేలు ఇస్తోంది. వీటిని 4 నెలలకు రూ.2 వేల చొప్పున 3 విడతల్లో డైరెక్టుగా రైతుల అకౌంట్లలో వేస్తోంది. ఈ స్కీమ్ కింద ఇప్పటి వరకు 1.38 లక్షల కోట్లను రైతులకు అందజేసింది.

Tagged India, agriculture, Farmer's, pm kisan, PM kisan money

Latest Videos

Subscribe Now

More News