గ్లోబల్​ లీడర్ల జాబితాలో టాప్.. ప్రపంచంలో నంబర్ వన్ మోదీ

గ్లోబల్​ లీడర్ల జాబితాలో టాప్..  ప్రపంచంలో నంబర్ వన్ మోదీ
  • 76% రేటింగ్​తో గ్లోబల్​ వరల్డ్​ లీడర్​గా మన ప్రధాని
  • రెండో స్థానంలో స్విట్జర్లాండ్​ ప్రెసిడెంట్​.. ఏడో స్థానంలో బైడెన్​
  • మార్నింగ్ కన్సల్ట్ సంస్థ తాజా సర్వేలో వెల్లడి


న్యూఢిల్లీ : మన ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి గ్లోబల్​ లీడర్ల జాబితాలో టాప్ లో నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ ఉన్న నేతగా నిలిచారు.. మార్నింగ్​ కన్సల్ట్ సంస్థ నిర్వహించిన ‘గ్లోబల్ లీడర్  అప్రూవల్’ సర్వేలో మొదటి స్థానం దక్కించుకున్నారు. ఆయనకు ఏకంగా 76 శాతం మంది ఆమోదం తెలపగా.. రెండో స్థానంలో నిలిచిన స్విట్జర్లాండ్​ ప్రెసిడెంట్​ అలెయిన్ బెర్సెట్​64 శాతం ప్రజామోదం లభించింది. కొన్నేండ్లుగా ప్రధాని మోదీ ఈ సర్వేలో నెంబర్ వన్​ గా ఉంటున్నారు. తాజాగా నిర్వహించిన సర్వేలోనూ ఆయనకు ప్రజాదరణ తగ్గలేద ని తేలింది. కాగా, ఈ జాబితాలో అమెరికా ప్రెసిడెంట్​ జో బైడెన్ ఏడో స్థానంలో ఉన్నారు. ప్రపంచ నేతగా బైడెన్ కు 40 శాతం మంది ఓటే శారు. 

కాగా, ఈ నెల 6 వ తేదీ నుంచి 12 వరకు నిర్వహించిన సర్వేలో ప్రపంచ నేతల్లో అతి తక్కువ నిరాదరణ కలిగిన నేతగా కూడా మోదీ నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా మోదీకి ఉన్న నిరాదరణ కేవలం 18% మాత్రమేనని సర్వేలో వెల్లడైంది. మరోవైపు, అత్యంత నిరాదరణ కలిగిన లీడర్​ గా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో నిలిచారు. ఆయనను నిరాదరిస్తూ ఏకంగా 58% మంది ఓటేశారు. ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన 22 మంది లీడర్లతో ఈ సర్వే నిర్వహించినట్లు మార్నింగ్​ కన్సల్ట్​ సంస్థ వెల్లడించింది. ప్రజాదరణ విషయంలో సౌత్​ కొరియా అధ్యక్షుడు యున్ సుక్ యోల్ నిలిచాడు.

ALSO READ: నిండు గర్భిణిని టైరుపై వాగు దాటించారు

సర్వేపై బీజేపీ నేతల స్పందన..

జీ20 సమిట్​ ను విజయవంతంగా నిర్వహించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా మోదీ గ్రాఫ్ మరింత పెరిగిందని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి అనిల్​బాలుని ట్వీట్ చేశారు.  నమ్మకానికి, నాయకత్వానికి మోదీ ఓ సింబల్​ అని కేంద్ర మంత్రి శోభా కరంద్లాజె పేర్కొన్నారు. మోదీ స్ఫూర్తిదాయక నేత అంటూ బీజేపీ ఏపీ ప్రెసిడెంట్​ పురందేశ్వరి కొనియాడారు.