న్యూఢిల్లీ: మలేషియాలోని కౌలాలంపూర్‌లో అక్టోబర్ 26 నుంచి 28 వరకు జరగనున్న ఆసియాన్ సమిట్ కు ప్రధాని మోదీ హాజరు కావడం లేదు. షెడ్యూల్ సమస్యల వల్లే సదస్సుకు ప్రధాని హాజరుకావడం లేదని.. అయితే, ఆయన వర్చువల్గా సమిట్‌లో పాల్గొంటారని కేంద్ర వర్గాలు తెలిపాయి. భారత్ తరఫున విదేశాంగ మంత్రి జైశంకర్ ఈ సమిట్ కు ప్రాతినిధ్యం వహిస్తారని పేర్కొన్నాయి.
ఈ నేపథ్యంలో సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మోదీ భేటీ లేనట్టేనని స్పష్టమైంది. అయితే, ఆసియాన్ కు మోదీ గైర్హాజరుపై కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ విమర్శలు గుప్పించారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను కలవకూడదనే మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ఇటీవల ఈజిప్టులో జరిగిన గాజా శాంతి సమావేశానికి కూడా ఆయన అటెండ్ కాలేదన్నారు.
