
కేంద్రం ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో గ్రీన్ గ్రోత్ పై దృష్టి సారించింది. అందులో భాగంగా గ్రీన్ ఎనర్జీ మార్కెట్ లో భారత్ ను అగ్రగామిగా నిలుపుతుందని ప్రధాని నరేంద్ర మోడీ ధీమా వ్యక్తం చేశారు. ‘భారత ప్రజలకు పర్యావరణ పరిరక్షణ అనేది బాధ్యత. అంతేకానీ బలవంతం కాదని మోడీ అన్నారు. మెరుగైన వాతావరణం లేకుండా మానవ సాధికారత అసాధ్యమని, సమగ్రతతో ముందుకు వెళ్లాలని ప్రధాని కోరారు. గ్రీన్ గ్రోత్ వృద్ధిపై ప్రసంగించిన మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా భారత్ లో పెట్టుబడులు పెట్టాలని విద్యుత్ రంగ సంస్థలను మోడీ ఆహ్వానించారు. గ్రీన్ గ్రోత్ ప్లాన్ లో భాగంగానే వెహికల్ స్క్రాపింగ్ పాలసీ, గోబర్గాన్ స్కీమ్ లను ప్రవేశపెట్టినట్లు తెలిపారు.