కామారెడ్డి బాధితుల‌కు PMNRF ప్ర‌క‌టించిన‌ ప్ర‌ధాని మోడీ

కామారెడ్డి బాధితుల‌కు PMNRF ప్ర‌క‌టించిన‌ ప్ర‌ధాని మోడీ

కామారెడ్డి జిల్లా హసన్ పల్లి శివారులో లారీ, ట్రాలీ ఆటో ఢీకొన్నాయి. ఆటోలో- వెళ్తున్న 9 మంది చనిపోగా, 17 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ఆరుగురు మహిళలు ఉన్నారు. బంధువు చనిపోవడంతో దినాలు నిర్వహించి తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతుల్లో ఎక్కువ మంది పిట్లం మండలం చిల్లర్గికి చెందినవాళ్లే ఉన్నారు. ప్రమాద టైంలో ఆటో లో 26 మంది ఉన్నారు. ప్రమాదంతో నాలుగు గ్రామాల్లో విషాదం నెలకొంది. మరికొందరి పరిస్థితి సిరియస్ గా ఉందని డాక్టర్లు తెలిపారు.

ప్రమాద ఘటనపై ప్రధాని మోడీ స్పందించారు. కామారెడ్డి రోడ్డు ప్రమాదం బాధాకరమన్న ప్రధాని మోడీ.. బాధితులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబ సభ్యులకు రెండు లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించార. గాయపడినవారికి 50 వేల రూపాయలను PMNRF నుంచి అందజేయనున్నట్లు తెలిపారు. 

కామారెడ్డి రోడ్డు ప్రమాదంపై ఎమ్మెల్సీ కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 9 మంది మృతి చెందడం బాధాకరమ‌ని క‌విత అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ప్రభుత్వం వారికి అన్ని విధాలా అండగా ఉంటుందని కవిత అన్నారు.