మాస్కోలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం

మాస్కోలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం

రష్యా టూర్ లో భాగంగా ప్రధాని మోదీ మాస్కో చేరుకున్నారు. ఉక్రెయిన్ పై రష్యా దాడి తర్వాత తొలిసారి భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యాలో పర్యటిస్తున్నారు. భారత్ , రష్యా 22వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో ఇరుదేశాల నేతలు పాల్గొంటారు. 

ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు, పరస్పరం సహాయ సహకారాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్యలపై నేతలు చర్చిస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. మాస్కోలో ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ నేతల మధ్య అనధికారిక చర్చలకు అవకాశం ఉంటుందని పెస్కోవ్ తెలిపింది.