'ఖాదీ ఉత్సవ్'లో పాల్గొన్న ప్రధాని మోడీ

'ఖాదీ ఉత్సవ్'లో పాల్గొన్న ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్రమోడీ చరఖా చేతబట్టి నూలు వడికారు. ఇవాళ ఆయన గుజరాత్ లో పర్యటించారు. ఇందులో భాగంగా అహ్మదాబాద్‌లో జరిగిన 'ఖాదీ ఉత్సవ్' కార్యక్రమానికి ఆ రాష్ట్ర సీఎం భూపేంద్ర పటేల్‌తో కలిసి మోడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా కొద్దిసేపు చరఖా తిప్పుతూ.. నూలు దారాన్ని తీసుకుని వ‌డికారు.

అనంతరం 'ఖాదీ ఉత్సవ్'లో పాల్గొన్న నేతకార మహిళతో మాట్లాడి.. వారి సమస్యలను తెలుసుకున్నారు. దేశానికి నేతన్నలు చేస్తున్న మేలును గుర్తుచేసుకుని.. వారి సేవలను కొనియాడారు. ఇంటిల్లి పాది నూలు వడికి కష్టపడే తీరు ఇతరులకు ఆదర్శవంతమని మోడీ వ్యాఖ్యానించారు.