
‘పీఎం నరేంద్రమోడీ’ పేరుతో తెరకెక్కుతున్న ప్రధానమంత్రి మోడీ బయోపిక్ వచ్చే నెల 12వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్ ను వేగంగా పూర్తిచేసి రిలీజ్ కు రెడీ చేస్తున్నారు ఫిలింమేకర్స్.
ఏప్రిల్ 11 నుంచి మే మూడోవారం వరకు ఏడు విడతల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడత ఎన్నికలు ముగిసిన మరుసటి రోజున… ఏప్రిల్ 12న పీఎం నరేంద్రమోడీ సినిమాను విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇవాళ రిలీజ్ డేట్ ను ప్రకటించారు.
ఈ సినిమాలో మోడీ టైటిల్ రోల్ లో వివేక్ ఆనంద్ ఒబెరాయ్ నటిస్తున్నాడు. ఒముంగ్ కుమార్ దర్శకత్వంలో… సందీప్ సింగ్, ఆనంద్ పండిట్ సురేష్ ఒబెరాయ్ సంయుక్తంగా మూవీని నిర్మిస్తున్నారు.
ఐతే.. ఎన్నికల టైమ్ లో ఓటర్లను ప్రభావితం చేసేలా సినిమా ఉంటుందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.