సీఎం జగన్‌కు ప్రధాని మోదీ బర్త్‌ డే విషెస్‌

సీఎం జగన్‌కు ప్రధాని మోదీ బర్త్‌ డే విషెస్‌

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ  పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా విష్ చేశారు.  సీఎం జగన్ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు.  మోదీ ట్వీట్ కు సీఎం జగన్ రిప్లయ్ ఇస్తూ ధన్యవాదాలు తెలిపారు.  

అటు  రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ కూడా సీఎం జగన్‌కి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.  ఇక సీఎం జగన్‌ పుట్టిన రోజు సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుుతున్నారు.   1972 డిసెంబర్ 21న జన్మించిన జగన్ ఇవాళ 51వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.